తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నేతృత్వంలోని గ్రానైట్ వ్యాపారుల బృందం బుధవారం విజయవాడలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో కలిసి గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. రాష్ట్రంలో ఈ రంగం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.