విజయవాడలో పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా

77చూసినవారు
విజయవాడ బందర్ రోడ్‌లో పెట్రోల్ పోసుకుని యువకుడు సోమవారం హల్చల్ చేశాడు. వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్