ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సూచించారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.