యోగాంధ్ర-2025లో చారిత్రక ఘట్టానికి విజయవాడ హరిత బెరం పార్కు వేదికగా నిలిచింది. వాటర్ క్రాఫ్ట్స్- ఫ్లోటింగ్ యోగా విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం నదిలో అత్యధిక మందితో బోట్లపై యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.