కొండూరు అడ్డరోడ్ నుండి రేపూడి తండా వరకు ఉన్న MNK రోడ్డుకు న్యూ డెవలప్మెంట్ కొరకు కూటమి ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో ఈ రోడ్డు మంజూరు చేశారు అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు పనులు జూన్ నెల నుండి ప్రారంభించి, నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని బుధవారం ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు.