మొదటి రోజే 99 శాతం మేర పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలి

82చూసినవారు
మొదటి రోజే 99 శాతం మేర పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలి
ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఇంటి వద్దే సామాజిక పింఛన్ల పంపిణీని జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. ఇందుకు పటిష్ఠ ప్రణాళిక, సమన్వయంతో కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆమె ఆదేశించారు. జిల్లాలో 2, 35, 477 మంది లబ్దిదారులకు రూ. 160. 53 కోట్ల మేర లబ్ధి అందించనున్నట్లు వెల్లడించారు. మొదటి రోజునే 99 శాతం మేర పంపిణీ పూర్తి కావాలన్నారు.

సంబంధిత పోస్ట్