ఎ.కొండూరు: భార్యను తీసుకెళ్లాడన్న అనుమానంతో దాడి

83చూసినవారు
ఎ.కొండూరు: భార్యను తీసుకెళ్లాడన్న అనుమానంతో దాడి
ఎన్‌టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడులో శుక్రవారం రాత్రి గుగులోతు హేమంత్నాయక్ అనే యువకుడిపై కత్తులతో దాడి జరిగింది. భార్య అంశంపై జరిగిన పాత వివాదంతో భద్రాద్రి కొత్తగూడెం వాసి తెండూల్కర్ కుటుంబ సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన హేమంత్ విజయవాడ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్