బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో కలిసి బుధవారం కోరారు. 2022లో కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లాకు బాపట్ల జిల్లా కేంద్రంగా మారిందని, ప్రజల నుంచి డిమాండ్ పెరిగినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్, ఫ్రీక్వెన్సీని ఇంతవరకు పెంచలేదన్నారు.