సెప్టెంబర్ 1 నుండి 10 వ తేదీ వరకు కొరియాలో జరగబోయే 17వ ప్రపంచ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన విజయవాడ నగర క్రీడాకారిణి నేలకుదిటి అనూషను బుధవారం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అభినందించారు. అనూష తమిళనాడులో జరగబోయే ఇండియన్ సాఫ్ట్ టెన్నిస్ కోచింగ్ క్యాంప్ కి హాజరవనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ ప్రద్యుమ్న, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ సంఘ చైర్మన్ దారం నవీన్ అనూషాను అభినందించారు.