ఈ నెల 30లోగా ఏపీ జీఎన్ఏ ఎన్నికల ప్రక్రియ పూర్తికి చర్యలు
By D.Nataraju 81చూసినవారుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ ఎన్నికల మొత్తం ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఎన్‌టీఆర్ జిల్లా కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న తనను ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ తాజాగా మార్గదర్శకాలు అందినట్లు వెల్లడించారు.