ఎన్టీఆర్ జిల్లా వాసులకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో పాటు 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది. జిల్లా వాసులంతా ఉష్ణోగ్రతల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు అంటున్నారు.