రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పశు పోషకులకు యాభై శాతం సబ్సిడీపై సమీకృత దాణా పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ. 1,110 విలువ కలిగిన యాభై కిలోల దాణాను రూ.555కే అందిస్తున్నట్లు తెలిపారు. పశు పోషకుల కోసం సబ్సిడీపై పశువుల కోసం గోకులాలు, నీటి తొట్టెలు నిర్మించినట్లు తెలిపారు.