భారత సైన్యం పాకిస్థాన్పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడంపై శుక్రవారం సాయంత్రం విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. 5 వేల మందితో ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది.