వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగవ రోజూ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరించి ధైర్యం చెప్పారు. కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కలెక్టరేట్ నుండి బయలుదేరి సింగ్ నగర్ ఫ్లై ఓవర్, జక్కంపూడి వెళ్లే మార్గం గుండా పైపుల రోడ్డు, వాంబే కాలనీల్లో పర్యటించారు.