ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియులైనపవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటల పాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు.