ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తీసుకోవాలన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హార్టీకల్చర్ పై మంగళవారం విజయవాడ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.