ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారిని శుక్రవారం భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద ఆశీస్సులు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేష వస్త్రాలను దుర్గగుడి ఈవో రామారావు అందజేశారు.