విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్లోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 180పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించినట్లు, ప్రైవేట్ హాస్పటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయం అన్నారు.