జి.కొండూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

69చూసినవారు
జి.కొండూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి వెలగలేరులో గురువారం చోటు చేసుకుంది. వెలగలేరుకు చెందిన గొర్రె కల్యాణ్‌ వెంకటాపురంలో ప్రార్థనకు వెళ్లిన తన తండ్రి జయరాజును ఇంటికి తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దింతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున కల్యాణ్‌ మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్