విజయవాడ: సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రజలు తమ సొంత ఊర్లకు శనివారం పయనమైయ్యారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ట్రాఫిక్ ఎక్కువసేపు అవ్వకుండా ఉండేందుకు, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్స్ సహాయంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ ప్రాంతాలను వదిలి గ్రామీణ ప్రాంతాలకు, సొంత ఊర్లకు జనం బయలుదేరారు.