కొండపల్లి: జూదమాడుతూ దొరికిన హెడ్ కానిస్టేబుల్.!

67చూసినవారు
కొండపల్లి: జూదమాడుతూ దొరికిన హెడ్ కానిస్టేబుల్.!
కొండపల్లిలో ఆదివారం రాత్రి జూద శిబిరంపై పోలీసుల దాడిలో ఓ హెడ్ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఎస్టీ కాలనీలో నివసించే కంచికచర్ల స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రభుకుమార్, తన ఇంటి వద్ద ఇతరులతో కలిసి జూదం ఆడుతుండగా ఎస్సై విజయలక్ష్మి దాడి చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్