బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం APNCET నిర్వహిస్తున్నామని విజయవాడలోని డా. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డా. పి. చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఇంటర్ పాసైన అభ్యర్థులు https://drntr.uhsap.in వెబ్‌సైట్‌లో 5వ తేదీ లోపు దరఖాస్తు చేయాలి. EAPCET రాసినవారు కూడా APNCET తప్పనిసరిగా రాయాలని తెలిపారు. కన్వీనర్ కోటాలో 8,576, మేనేజ్‌మెంట్ కోటాలో 5,150 సీట్లు భర్తీ చేస్తామన్నారు.