భవానిపురం పోలీస్ స్టేషన్ లో గంజాయి వ్యక్తి అరెస్ట్

విజయవాడ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు బుధవారం భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించి అమ్మే వారిపై గట్టి నిఘా ఉంచామని భవానిపురం సీఐ. ఉమామహేశ్వరరావు తెలిపారు.దానిలో భాగంగా అక్బర్ బాషా అనే అతను గంజాయి అమ్ముతున్నట్టు సమాచారంతో ఇతనిపై గతంలో ఐదు గంజాయి కేసులు నమోదు కావడంతో ఇతనిపై మొత్తం 31 కేసులు ఉన్నాయని, ఇతను ప్రవర్తన మార్పు రాకపోవడంతో జైలుకు తరలించడం జరిగిందన్నారు.