ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో శుక్రవారం మరికొన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో తవ్విన కొద్దీ వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో మరిన్ని అరెస్ట్‌లు తప్పవనే చర్చ జరుగుతోంది. గత రెండు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు.