ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందచేశారు.