తమిళనాడు పొలాచిలో డిసెంబర్ 5 నుంచి 15 వరకు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 విభాగం కింద ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇన్ లైన్ ఫ్రీ స్టైల్ లో బంగారు పతకాన్ని సాధించిన మెరుగుపాల హశీష్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. హశీష్ తల్లిదండ్రులు మెరుగుపాల రాజు, శివ మాధవిలను ప్రశంసించారు. ఆదివారం హశీష్ తన తల్లిదండ్రులతో ఎంపిని కలవటం జరిగింది.