జగన్ తన పాలనలో ప్రజా సంక్షేమం పక్కన పెట్టి తన సంతోషం కోసమే పాలన సాగించాడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజా సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు.