గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా కొండపల్లికి చెందిన జనసేన పార్టీ నాయకురాలు చెరుకుమల్లి రాధిక నియామితులయ్యారు. శనివారం కూటమి సర్దుబాటులో భాగంగా రాధికకు డైరెక్టర్ పోస్టు లభించింది. కొండపల్లి జనసేన పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్ సతీమణి చెరుకుమల్లి రాధిక. గత మున్సిపల్ ఎన్నికల్లో 28 వ వార్డు లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.