రొయ్యూరు: వ్యక్తిని బలి తీసుకున్న పేకాట

పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన తోటవల్లూరు మండలం రొయ్యూరులో శనివారం జరిగింది. లంకభూముల్లో కొందరు పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందడంతో వారు అక్కడికి వెళ్లారు. దీంతో భయపడి వెంకటేశ్వరరావు, గోపాలరావు అనే వ్యక్తులు కృష్ణా నది పాయలోని నీటి గుంతలో దూకి అవతల ఒడ్డుకు వెళ్లేందుకు యత్నించగా గోపాల్ రావు నీటిలో మునిగిపోయారు. కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే మృతి చెందారు.