విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, డ్రెయిన్ల వ్యవస్థపై దృష్టిసారించామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ, జిల్లా కలెక్టర్ లు సమన్వయ సమావేశం నిర్వహించారు.