విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఓంకారం టర్నింగ్ వద్ద కారును ఆపి పూజా సామాగ్రి కోసం వెళ్లిన భక్తులు తిరిగి వచ్చేసరికి కారులో ఉంచిన 25 కాసుల బంగారం మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.