ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్థానిక కుమ్మరపాలెం సెంటర్ లో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ద్విచక్ర వాహనలపై ప్రయాణించే వాహనదారులు హెల్మెంట్ లేకుండా ప్రయాణించే వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహనాలకు గతంలో చలానా కట్టని యెడల వారితో చలానాలు కట్టించారు.