విజయవాడ లోని అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్ జంక్షన్ వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.