ఆర్ధిక నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట సీఐ కొండలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్త చట్టాలు వాటిపై అవగాహన కల్పించడానికి చిన్నా నగర్ లో విఘ్నేష్ హైట్స్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కొత్త చట్టాలు, సైబర్ నేరాలు, తదితరులు అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడకుండా తప్పించుకొనే జాగ్రత్తలు గురుంచి క్షుణ్ణంగా వివరించారు.