విజయవాడ: కొనసాగుతున్న బుడమేరు రిటైనింగ్ వాల్ పనులు

55చూసినవారు
విజయవాడ: కొనసాగుతున్న బుడమేరు రిటైనింగ్ వాల్ పనులు
గత సంవత్సరం బుడమేరు వాగుకు గండ్లు పడి విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరదకు శాశ్వత పరిష్కారంగా శాంతినగర్ సమీపంలోని బుడమేరు డైవర్షన్ కెనాల్ పై రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. 11 మీటర్ల లోతు నుంచి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు మొత్తం 500 మీటర్ల పొడవునా నిర్మాణం చేపట్టారు. విజయవాడ నగరం నుంచి వెళ్తున్న బుడమేరు వాగుపై ఆక్రమణలను తొలగించేందుకు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్