ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తిరంగా యాత్ర ప్రారంభానికి ముందు సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. త్రివర్ణ పతాకాలు చేతబూనిన బాలికలు తమ నృత్యాలతో చూపరులను అలరించారు. వారి ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది.