జాతీయస్థాయి క్యాడిట్ (అండర్ 14) మరియు సీనియర్ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం46 పతకాలను గెలుచుకున్నారు. వీటిలో 19 బంగారు పతకాలు, 16వెండి, 11కాంస్య పతకాలుసాధించారు. గెలుపొందిన క్రీడాకారులను మంగళవారం కలెక్టర్ అభినందించారు.