విజయవాడ: టీటీడీపై బురదజల్లేందుకు నిత్యం విషప్రచారం: హోం మంత్రి

64చూసినవారు
విజయవాడ: టీటీడీపై బురదజల్లేందుకు నిత్యం విషప్రచారం: హోం మంత్రి
మత కలహాలు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. బుధవారం విజయవాడ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కుయుక్తులకు దిగుతోందని ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలో మృతి చెందినా హత్యగా చిత్రీకరించేందుకు తప్పుడు ప్రచారం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్