ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని, జీరో కరెప్షన్ దిశగా పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ దృష్టి పెట్టి విచారణ జరపాలని, తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై విజయవాడలో శనివారం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.