విజయవాడ: వైష్ణవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేట్లు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజన వసతికి విద్యార్థులకు ప్లేట్లు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్ సంతోష్ వైష్ణవి వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్ళగా శుక్రవారం అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ స్పందించారు. దుర్గారమేష్ స్పందించి తన కూతురు కొల్లి చేశ్విత వల్లి రెండో పుట్టినరోజు సందర్భంగా 150 ప్లేట్లను పిల్లలకు అందించారు.