గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రూ. 5, 447 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేసిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ మండిపడ్డారు. బుధవారం పటమటలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 8 నెలల్లో రూ. 800 కోట్ల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆర్థిక మనో ధైర్యాన్ని పెంచారన్నారు. 'ఫీజు పోరు' కలెక్టరేట్ల ముందు చేయడం కాదు, జగన్ ప్యాలెస్ ముందు చేయాలని దుయ్యబట్టారు.