సాటి మనిషికి అందించే సాయం ఏదైనా గొప్పదే. అదే ఓ నిండు ప్రాణాన్ని కాపాడే సాయం అయితే దాని విలువ మరింత పెరుగుతుంది. రక్తదానం కూడా అలాంటి సాయమే అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివార ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లిలోని బీపీసీఎల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.