నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఓ ప్రైవేటు బ్యాంకును బురిడీ కొట్టించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. భవానీపురంలోని ఓ ప్రైవేటు సంస్థలో కోమల శ్రీరామ్ గతేడాది 54.7 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకులో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు బంగారం నకిలీదని తేలడంతో బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.