విజయవాడ: 'ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు'

73చూసినవారు
విజయవాడ: 'ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు'
ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేత పేర్ని నానిపై శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాపం పండిందని, ఇక ఆయన్ను వదిలేది లేదన్నారు. ఐదేళ్లు ప్రజలను దోచిన నాని ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తహశీల్దార్ బదిలీ అయిన తర్వాత పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 6,400 టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బందరు పోర్టు 2026 నాటికి పూర్తవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్