తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ గురువారం ఉదయం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, పార్టీ ఉపాధ్యక్షుడు, తితిదే బోర్డు సభ్యుడు బీ. మహేందర్ రెడ్డి, ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు తదితరులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.