రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి భరత్ తెలిపారు. శుక్రవారం విజయవాడ ఏపీఐఐసీ కార్యాలయంలో ఆహార పరిశ్రమల ప్రోత్సాహక సౌలభ్య వన్-స్టాప్ హెల్ప్‌లైన్ 04045901100 ను మంత్రి టీజీ భరత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూఆహార ప్రాసెసింగ్ రంగంలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యం అన్నారు.