ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి. లక్ష్మీశాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశాకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు.