అంసఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం విజయవాడలో ఇ-శ్రమ్ పోర్టల్ కు సంబంధించి రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోటి 50 లక్షల మందిని ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిష్టర్ చేయించాలని అన్నారు.