విజయవాడ: గుజరాత్ మాజీ సీఎం మృతి పట్ల పవన్ సంతాపం

84చూసినవారు
విజయవాడ: గుజరాత్ మాజీ సీఎం మృతి పట్ల పవన్ సంతాపం
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు మరికొంతమంది ప్రయాణికులు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం సంతాపం తెలిపారు. ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచిన రూపానీ నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. వారి కుటుంబానికి, బీజేపీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్