33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 3, 111 పిటిషన్లు రాగా 3, 015 అర్జీల పరిష్కారం (96 శాతం) పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం సీసీఎల్ఏ జి. జయలక్ష్మి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ సదస్సుల పిటిషన్ల పరిష్కారం, పీజీఆర్ఎస్-రెవెన్యూ అర్జీల పరిష్కార పురోగతి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.